Skip to main content

Posts

Showing posts from April, 2014

వికీపీడియా లో ఊటూరు

    వికిపిడియా ఒక సమాచార బండగారం,  వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము .  ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.         ఈ మద్యనే    వికీపీడియా లో   ఊటూరు గురించి న సమాచారం చేర్చబడింది . మన మండలం లో దాదాపుగా ఏ   ఊరు గురుంచి వికిపిడియా లో సమాచారం లేదు .               మీ వద్ద గల సమాచారం తో ఊటూరు పేజి ని అప్డేట్ చేయవచు. దీనికి ఏ  ఎకౌంటు అవసరం లేదు వికిపిడియా లో ఏ  సమాచారం అయిన అప్డేట్ చేయవచ్చు.  వికిపిడియా లో ఊటూరు కోసం ఇక్కడ క్లిక్ చేయండి  ( వికీపీడియా లో ఊటూరు ) www.utoorvillage.com 

మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు

   ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన యుధం ఓటు .   కావున ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండ వినియోగించు కోవాలి . గ్రామాలలో కంటే పట్టణాలలో నే తక్కువ గా పోలింగ్ నమోదు అవుతుంది    విచిత్రమైన   పరిస్థితి   ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు     అంటే చదువుకున్న వారే ఓటు హక్కు ని వినియోగించుకోవడం లేదు .  100 కి 200 కి రైస్ కుకర్ ల కి ఎంతో విలువైన ఓటు ని అమ్ముకోకండి .   ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు . ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం . మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు .  నచ్చకపోతే నోటా ఎన్నికల బరిలో నేరచరితులు , ధనస్వాములు , కులస్వాములు .. కండబలాఢ్యులే ఉంటే ? వీళ్లెవరూ నచ్చకపోయినా ఓటెయ్యక తప్పనిసరి పరిస్థితి . ఇది మొన్నటి వరకు ఉన్న ఎన్నికల వ్యవస్థ . కానీ ఈ దఫా ఎన్నికల్లో నేరస్వామ్యంపై నిరసనాస్ర్తాన్ని సంధించేందుకు సరికొత్త అస్త్రం వచ్చేసింది . అదే నోటా ( నన్ ఆఫ్ ద ఎబోవ్ ) అనే ఆప్షన్ ‌ ను ఎన్

2014 మానకొండూర్ అసెంబ్లీ అబ్యర్థిగా ఏ పార్టి గెలుస్తింది ?

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .

జయతు జయతు మంత్రం ,జన్మ సాఫల్య మంత్రం - జనన మరణ భేద క్లేశ విచ్చేద మంత్రం సకల నిగమ మంత్రం ,సర్వ శాస్త్రైక మంత్రం – రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం ||                మిత్రులందరికీ   శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .               సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం  ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ

మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి

మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి. మొదటిది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరు  అనే గ్రామం. మా తాతముత్తాతలదా ఊరే. మా నాన్న (జనార్దనరెడ్డి) వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. అంతమందిలో పంచుకున్నప్పుడు తగినంత భూవసతి ఏర ్పడలేదాయనకు. అందువల్ల గంగ (గోదావరి) దాటి వచ్చి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఫారెస్టు కంట్రాక్టర్ల దగ్గర గుమస్తాగా చేరారు. ముగ్గురు అక్కయ్యలు, నేను, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు వెరసి ఏడుగురు పిల్లలం మేం. మా పెదనాన్న, మేనత్త - ఊటూరులోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందువల్ల నాకు పదేళ్ల వయసు వచ్చేవరకూ ప్రతి పండగకూ సెలవులకూ ఊటూరెళ్లిపోయేవాళ్లం. అది సంప్రదాయకమైన పల్లెటూరు. కుల వ్యవస్థ, మతాచారాలు, ఆర్థిక తారతమ్యాలు అన్నీ బలంగా ఉండేవి అక్కడ. స్పష్టంగా బైటికి తెలిసేవి కూడా. ఊటూరు - జోగాపురం మధ్యన సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. తేడాలు మాత్రం చాలా ఎక్కువ. అంత చిన్న వయసులోనూ మాకు స్పష్టంగా తెలిసేవి. మా ఊరితో పోల్చినప్పుడు ఊటూరు మనుషుల్లో వ్యవసాయంలో, వ్యవహారంలో ఆధునికత కనిపించేది. అక్కడ వైష్ణవం ఎక్కువ. గురువులు వచ్చి సందేశాలిచ్చేవారు. వాళ్లు మడి

ప్రతి గ్రామానికి ఒక వెబ్ సైట్ వుంటే మంచిదని

మా వూరు.కామ్ అన్న పేరు తో ప్రతి గ్రామానికి ఒక వెబ్ సైట్ వుంటే మంచిదని,  ఈనాడు సండే బుక్ లో వచ్చిన ఒక మంచి ఆర్టికల్.