Skip to main content

Posts

Showing posts from May, 2015

ఆదరణ లేక.. అంతరిస్తోన్న చేనేత - ఊటూర్‌

నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు  చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు. నవతెలంగాణ - కరీంనగర్‌ టౌన్‌ ఇవీ చేనేత సంఘాలు.. చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్‌ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్‌, హెచ్‌డబ్లూసిహెచ్‌ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్‌, బాపూజీ( హుజురాబాద్‌), ఆముదాల పల్లి (శంకరపట్నం),

పండుగల మిషన్ కాకతీయ పనులు - ఊటూరు

మిషన్ కాకతీయ పనులు పండుగలా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయని   రాష్ట్ర సాస్కృతిక సారథి చైర్మిన్ ఏమ్మేల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలో ని ఊటూర్ , రంగపేట , కేల్లేడ గ్రామాల్లోని చెరువుల్లో మంగళవారం సాయంత్రం పూడికతీత పనులను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ తోనే గ్రామాలు అబివృద్ది చెండుతాయనే సి ఎం కేసిఆర్ ఈ కార్యక్రమాని చేపట్టారన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సీమాంద్ర పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణా ప్రబుత్వం హయంలో  పూర్వ వైబవం సంతరించుకోనున్నాయని వివరించారు. కాంట్రాక్టర్లు నిబందనల మేరకు పనులు నిర్వహించని నాణ్యత పాటించని వారికి బిల్లులు రద్దు చేసి వేరే వారికి పనులు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు. రూ. కోటి 74 లక్షలతో ఊటూరు నుంచి వెగురుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఊటూరు ను అబివృద్ధి లో అగ్రగ్గమిగా నిలుపుతానని గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు   గత ప్రబుత్వ పాలనలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఒక్క నిమిషం