Skip to main content

ఆదరణ లేక.. అంతరిస్తోన్న చేనేత - ఊటూర్‌


నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు 
చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు.
నవతెలంగాణ - కరీంనగర్‌ టౌన్‌


ఇవీ చేనేత సంఘాలు..

చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్‌ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్‌, హెచ్‌డబ్లూసిహెచ్‌ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్‌, బాపూజీ( హుజురాబాద్‌), ఆముదాల పల్లి (శంకరపట్నం), శ్రీవెంకటేశ్వర (కనుకుల), చొప్పదండి, మానకొండూర్‌ మండలం పచ్చునూర్‌, ఊటూర్‌, కొండపల్కల, వీణవంక, కోర్కల్‌, జమ్మికుంట(శత్రంజి), బాలాజి (కొత్తపల్లి), మన్నెంపల్లి (తిమ్మాపూర్‌), దుద్దెనపల్లి (పైదాపూర్‌), పొట్లపల్లి (హుస్నాబాద్‌), శ్రీరాములపల్లి (కోహెడ), సిరిసిల్లలోని మహేశ్వర, భద్రావతి, జగదాంభ, కమలాపూర్‌, మర్రిపల్లిగూడెం చేనేత సహకార సంఘాలున్నాయి.

ఉత్పత్తులు..

    ఈ సంఘాల్లోని చేనేత కార్మికులు టవల్స్‌, లుంగీలు, బెడ్‌షీట్స్‌, డోర్‌కర్టూన్స్‌, పాలిస్టర్‌ షర్టింగ్‌, షూటింగ్‌, చెద్దర్లు, పిల్లో కవర్స్‌..ఇలా అనేక ఉత్పత్తులు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ వస్త్రాలను వినియోగిస్తున్నారు. ప్రధానంగా పాలిస్టర్‌ షర్టింగ్‌, షూటింగ్‌ వస్త్రాలను ఆర్‌విఎం ద్వారా విద్యార్ధులకు ఏకరూప దుస్తులను అందిస్తున్నారు.హాస్టళ్లలోని విద్యార్ధులకు బెడ్‌షీట్స్‌, కార్పెట్స్‌ ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. ఇతర శాఖలకు అవసరమైన వస్త్రాలను ఆప్కో సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు.

బకాయిలు ఇవీ..

     34 చేనేత సంఘాలు సహకార బ్యాంకు ద్వారా రూ. 2.5 కోట్ల రుణాలు క్యాష్‌ క్రెడిట్‌ ద్వారా తీసుకున్నాయి. వీటికి ఆయా సంఘాలు పావలా వడ్డీ మాత్రమే చెల్లించాలి. మిగతా వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. గత మూడు సంవత్సరాల నుండి చేనేత సంఘాలు బ్యాంకులకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్‌ మెంట్‌ ద్వారా ఈ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 2015 వరకు రూ. 70 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. వస్త్రాలకు అవసరమయ్యే ముడి సరుకైన నూలుపై రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం రాయితీ చెల్లిస్తుంది. గత సంవత్సరం మార్చి వరకు మొత్తం రూ.2.70 కోట్లు ప్రభుత్వం నుండి రావల్సి ఉంది.ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు ఎప్పటికప్పుడు ఆయా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తమకు చెల్లించడం లేదనే సాకుతో సంఘాలకు ఆప్కో బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటి వరకు 2014 నవంబర్‌ నుండి ఇప్పటి వరకు చేనేత సంఘాలకు రూ. ఆరు కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో కమలాపూర్‌కు రూ. 75 లక్షలు, జిల్లా కేంద్రంలోని ఆదర్శ-1కు రూ.30 లక్షలు, ఆదర్శ-2కు 40 లక్షలు.. ఇలా బకాయిలు ఆప్కో చెల్లించాల్సి ఉంది. వాటి విడుదలకు ఆప్కో అధికారులు మొండికేస్తున్నారు.ప్రభుత్వం, ఆప్కో నుండి రావల్సిన బకాయిలు రాకపోవడం వల్ల చేనేత సంఘాల ప్రతినిధులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ. రెండు నుండి రూ. 3 వరకు వడ్డీకీ అప్పులు చేసి కార్మికులకు కూలీ చెల్లిస్తున్నారు. కొన్ని సంఘాల్లో నెలల తరబడి కూళ్లు చెల్లించని పరిస్థితి నెలకొంది. 

ప్రభుత్వం సహకరించాలి
      ప్రభుత్వం సహకరిం చ కుంటే సంఘాలు నడ వడం కష్టం. వస్త్రోత్పత్తి తో వృద్ధులు, మహిళలు తక్కువ కూలీ తోనైనా ఉ పాధి లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థి తి లేదు. ప్రస్తుతం రోడ్డున పడే అవకాశాలున్నా యి. చేనేత కార్మికులకు రోజుకు కనీసం రూ. 150 కూలీ లభించాలి. ఆప్కో విడిపో నుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్ర మను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
- ఉసకోయిల రాంచంద్రం
(చేనేత సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు )

'తెలంగాణలో మా బతుకులు మారుతా యనుకున్నాం
   ఉన్న కాస్త పనీ దొరకని పరిస్థితి నెల కొంది. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను మూడు మార్లు కలిశాం. ఫలితం శూన్యం. మగ్గం నుండి సంబంధం లేని పవర్‌ లూంకు మారాలని మంత్రి సూచించారు. ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. బిల్లులు రాక చొప్పదండి సంఘంలో కార్మికులకు నెలకు 15 రోజుల పని మాత్రమే దొరుకుతుంది. 
- అనుమాల్ల నర్సయ్య
(చొప్పదండి చేనేత సంఘం ప్రతినిధి)

నెలకు రూ.2వేలు మించడం లేదు
    నెల మొత్తం పని చేస్తే రూ. రెండు వేలు వస్తాయి. 15 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. సరుకుల ధరలు పెరిగాయి. పని లేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. తెలంగాణలో కూలీ పెరుతుందని అనుకున్నా..ఉన్న పని పోతుందని అనుకోలే. దానికి తోడు నిత్యావసర సరుకుల ధరలూ పెరిగాయి. కుటుంబపోషణకు వచ్చే ఆదాయం ఏమాత్రమూ సరిపోవడం లేదు. 
- ఆడెపు లక్ష్మీ
(పచ్చునూర్‌, కార్పెట్‌ చేనేత కార్మికురాలు)

పనిచేస్తేనే ముద్ద దిగేది
       పాలిస్టర్‌ నేస్తే రోజుకు రూ. 40 కూలీ వచ్చేది. ఇప్పుడు నూలు లేదంటు న్నరు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి నాది. నెలలో సగం రోజులు కూడా పని దొరకడం లేదు. కనీసం నా అన్న వారు, కొడుకులు, బిడ్డలు లేరు. పని చేస్తేనే కడుపుకో ముద్ద దొరికేది. ఇప్పడు ఉన్న పని లేకుంటే ఎట్లా బతికేది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. 
- సాయిలు 
(కరీంనగర్‌ మండలం కొత్తపల్లి మార్కెండేయ చేనేత సంఘం కార్మికుడు)

మాపై దయ చూపలేదు.
      పావలావడ్డీ, యార్న్‌ సబ్సిడీ, ఆప్కో బకాయిల కోసం హైదరాబాద్‌లోని చేనేత జౌళిశాఖ కమిషనర్‌, మంత్రులు, ఆప్కో అధికారులను అనేక మార్లు కలిశాం. మాపై దయ చూపలేదు. సిరిసిల్లలోని మంత్రి కెటిఆర్‌ పవర్‌ లూం కార్మికులపై అప్పుడ డప్పుడు సమా వేశాలు నిర్వహిస్తున్నారు. చేనే త పరిశ్రమను కనీసం మరో మంత్రి ఈటెల రాజేందర్‌ పట్టించుకోవడం దురదృష్టకరం.
- వెంకటేశం..
(చేనేత సహకార సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి)


Ref : Navatelangana.com   08/05/2015


Download ఊటూరు ANDROID APP for latest updates  Click here to download 




Comments


  1. మీరు రాసింది నిజమే.చేనేతరంగానికి ప్రభుత్వాలు బాగా ఆర్థిక.ఇతర సహాయల్ని అందజేయాలి,కాని మిల్లుయజమానుల ఒత్తిడితో నిర్లక్ష్యం చేస్తున్నరు.ఈ మధ్య కొన్నిప్రత్యెక డిజైన్లతో వస్త్రాలునేసే వారికి (ఉదా;;పోచంపల్లి,బెనారెస్ ,కంచి మొ; ) ఉన్న పేటెంట్ హక్కును రద్దుచేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని అనేకులు చేపట్టిన ఆందోళన వల్ల మళ్ళీ ఉపసమ్హరించుకున్నారు.ఆ పిటీషన్ ని నేనుకూడా కంప్యూటర్ లో సమర్థించాను.ఇంకా ప్రభుత్వాలపై ప్రజాసంఘాలు ఇలాగే వత్తిడి తెస్తూ ఉండాలి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు