Skip to main content

పండుగల మిషన్ కాకతీయ పనులు - ఊటూరు



మిషన్ కాకతీయ పనులు పండుగలా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయని  రాష్ట్ర సాస్కృతిక సారథి చైర్మిన్ ఏమ్మేల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలో ని ఊటూర్ , రంగపేట , కేల్లేడ గ్రామాల్లోని చెరువుల్లో మంగళవారం సాయంత్రం పూడికతీత పనులను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ తోనే గ్రామాలు అబివృద్ది చెండుతాయనే సి ఎం కేసిఆర్ ఈ కార్యక్రమాని చేపట్టారన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సీమాంద్ర పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణా ప్రబుత్వం హయంలో  పూర్వ వైబవం సంతరించుకోనున్నాయని వివరించారు. కాంట్రాక్టర్లు నిబందనల మేరకు పనులు నిర్వహించని నాణ్యత పాటించని వారికి బిల్లులు రద్దు చేసి వేరే వారికి పనులు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు.రూ. కోటి 74 లక్షలతో ఊటూరు నుంచి వెగురుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఊటూరు ను అబివృద్ధి లో అగ్రగ్గమిగా నిలుపుతానని గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు 

 గత ప్రబుత్వ పాలనలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఒక్క నిమిషం కూడా సమస్య తలెత్తకుండా సిఎం ఇంతో కృషి చేశారని వెల్లడించారు. రైతు శ్రేయస్సు కోసం వచ్చే మార్చి నుంచి 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

                 ఈ కార్యక్రమం లో సర్పంచులు గోపు శ్రీనివాస్ రెడ్డి, రుద్రారం శ్రీనివాస్, బత్తిని బూమయ్య గౌడ్, మోద్దసాని శ్రీధర్ రెడ్డి, ఏరు కొండ స్వప్న, సాయవేని సదానందం, ఎం పి టి సి లు ఉషాకోయిల విజయ, కోలా లక్ష్మి, తహసిల్దార్ విద్యాదరచారి, ఆర్ ఐ భగవంతరావు, ఎం పీ పీ మాతంగి లింగయ్య, జడ్పీ సబ్యుడు ఎడ్ల సుగుణాకర్, వైస్ ఎం పీ పీ దేవా సతీష్ రెడ్డి, టీ ఆర్ ఎస్ రాష్ట్ర కమిటి సబ్యుడు జీ వి రామకృష్ణ రావు , మండల అద్యక్షుడు నూతి శ్రీనివాస్, నాయకులు మాడ  తిరుపతిరెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి , ఎదుల విజయబాస్కర్ రెడ్డి, ఏనాగందుల సుదర్శన్, ఉషాకోయిల లక్ష్మణ్ , రేమిడి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రవీందర్ రెడ్డి, రామిదడి  శంకర్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Ref : http://namasthetelangaana.com 06/05/2015



Comments

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు

   ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన యుధం ఓటు .   కావున ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండ వినియోగించు కోవాలి . గ్రామాలలో కంటే పట్టణాలలో నే తక్కువ గా పోలింగ్ నమోదు అవుతుంది    విచిత్రమైన   పరిస్థితి   ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు     అంటే చదువుకున్న వారే ఓటు హక్కు ని వినియోగించుకోవడం లేదు .  100 కి 200 కి రైస్ కుకర్ ల కి ఎంతో విలువైన ఓటు ని అమ్ముకోకండి .   ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు . ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం . మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు .  నచ్చకపోతే నోటా ఎన్నికల బరిలో నేరచరితులు , ధనస్వాములు , కులస్వాములు .. కండబలాఢ్యులే ఉంటే ? వీళ్లెవరూ నచ్చకపోయినా ఓటెయ్యక తప్పనిసరి పరిస్థితి . ఇది మొన్నటి వరకు ఉన్న ఎన్నికల వ్యవస్థ . కానీ ఈ దఫా ఎన్నికల్లో నేరస్వామ్యంపై నిరసనాస్ర్తాన్ని సంధించేందుకు సరికొత్త అస్త్రం వచ్చేసింది . అదే నోటా ( నన్ ఆఫ్ ద ఎబోవ్ ) అనే ఆప్షన్ ‌ ను ఎన్