Skip to main content

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .


జయతు జయతు మంత్రం ,జన్మ సాఫల్య మంత్రం -
జనన మరణ భేద క్లేశ విచ్చేద మంత్రం
సకల నిగమ మంత్రం ,సర్వ శాస్త్రైక మంత్రం –
రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం ||

               మిత్రులందరికీ 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .

              సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

www.utoorvillage.com
_________________________________________________________________________________

Comments

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు