నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు. నవతెలంగాణ - కరీంనగర్ టౌన్ ఇవీ చేనేత సంఘాలు.. చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్, హెచ్‌డబ్లూసిహెచ్ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్, బాపూజీ( హుజురాబాద్), ఆముదాల పల్లి (శంకరపట్న...
పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు