Skip to main content

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు 
అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు..


హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. 



ఐటీ నుంచి అగ్రికల్చర్‌కు..

సతీష్‌కుమార్ బుర్రా.. ఊరు ఊటూరు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలోని పల్లెటూరు. సతీష్ నాన్న సింగరేణి ఉద్యోగి. సతీష్ ఎంసీఏ చదివిండు. ఆ తర్వాత కలకత్తా ఐఐఎంలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివిండు. చదువు పూర్తికాగానే కొలువులో చేరి, విదేశాలకు పయనమైండు. పదేళ్లు విదేశాల్లోనే ఉన్నడు. కొంతకాలం క్యాప్ జెమినీలో హెడ్‌గా పనిచేసిండు. ఆ తర్వాత నెదర్లాండ్‌లో ఓ కంపెనీలో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. ఓరోజు అన్నకు ఆరోగ్యం బాగాలేదని సతీష్‌కు కబురందింది. అన్నకు క్యాన్సర్ అన్న మాట అతడిని కలిచివేసింది. బతికించుకుందామని ఎంత ప్రయత్నించినా ఆశలు అడియాశలయ్యాయి. అన్న మద్యం ముట్టడు, ధూమపానం చేయడు అయినా పాంక్రియాసిస్ అతడ్ని కబళించింది. ఆ స్థితిలో ఉద్యోగం వదిలిపెట్టి స్వదేశానికి వచ్చిండు. అన్న మరణానికి కారణమైన క్యాన్సర్‌పై అధ్యయనం మొదలుపెట్టిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, కోల్‌కతాలోని టాటా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్‌పై విస్తృతంగా అధ్యయనం చేసిండు. నిర్లక్ష్యం వల్లే క్యాన్సర్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిండు. 



వెనుదిరిగితేనే ముందడుగు..

తీసుకునే ఆహారంలో కల్తీవల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. కల్తీ ఆహారంలో పోషక విలువలు లోపించడం వల్ల మనుషులు నిస్సత్తువగా తయారవుతున్నారు.. ఆ తర్వాత రోగాలు విజృంభిస్తున్నాయి. అంతిమంగా క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని తెలుసుకుని ఆరోగ్యవంతమైన ఆహారం అందరికీ అందట్లేదని గుర్తించిండు. పురుగుమందులతో సేద్యం, రసాయనాలతో నిల్వలు, కల్తీ ఆహారం తింటూపోతే రేపటి రోజులు మరింత ప్రమాదకరంగా ఉంటాయని భావించిండు. తమకున్న ఎనిమిది ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టిండు. పురుగు మందుల ఖర్చు లేకుండా, తక్కువ వ్యయంతో పంటలు పండించిండు. సతీష్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది రైతులు కూడా సేంద్రియ సాగుకు సిద్ధమయ్యారు. తన స్వగ్రామంలో సతీష్ 24మందిని సేంద్రియ సాగులోకి నడిపించిండు. అయితే సతీష్ పండించిన టమాటా, మినుములకు మార్కెట్ లేదు. కారణం మార్కెటింగ్ విధానంలోని వ్యాపారులకు సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన లేదు. దీంతో సొంతంగా మార్కెంటింగ్ చేసుకోవడమో, వేరే వ్యాపారంతో వీటిని ప్రమోట్ చేయడమో చేయాలనుకున్నడు. అనుకున్నట్లే హైదరాబాద్‌లో ఆర్గానిక్ థాలీ పేరుతో సేంద్రియ ఉత్పత్తులతో భోజనం వడ్డించేందుకు రంగం సిద్ధం చేసిండు. 



షడ్రుచుల సేవ..

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాటికి ఆదరణలేదు. వాళ్ల సహకారంతో సేంద్రియ భోజనాన్ని అందించేందుకు జూబ్లీహిల్స్‌లో పెద్ద వంటశాలను ఏర్పాటు చేసిండు. నల్గొండ జిల్లాలో అయిదేళ్ల నుంచి మోటకొండూరులో సేంద్రియ పద్ధతిలో మహిళా స్వయం సహాయక సంఘాలు వ్యవసాయం చేస్తున్నాయి. వాళ్ల దగ్గర బియ్యం కొనుగోలు చేసిండు. మహబూబ్‌నగర్ నుంచి కూరగాయలు, తన గ్రామంలోని ఓ పాడిరైతు నుంచి నేరుగా పాలు కొనుగోలు చేస్తూ వంటసాలలో కమ్మని రుచులు వండడం ప్రారంభించిండు. ఈ భోజనాన్ని వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి వడ్డించడం మొదలుపెట్టారు. ఈ ఐడియా ఉద్యోగులకు నచ్చింది. దినదిన ప్రవర్ధమానం చెందుతూ పలు కంపెనీలకు విస్తరించింది. ఈ కమ్మని రుచులు ఆగస్ట్ ఫెస్ట్‌లో మెంటర్స్‌కు నచ్చాయి. ఆగస్ట్ ఫెస్ట్ ఆదరణతో ఆర్గానిక్ థాలీ బ్రాండ్‌కు మరింత పాపులారిటీ పెరిగింది. ఆర్డర్లు పెరగడంతో కిచెన్‌లో వంటకాలు పెరిగాయి. ఒరాకిల్, క్యాప్‌జెమిని, మహీంద్రా, వాక్ఫిన్, సింక్రోని, టెక్ మహీంద్ర, జీఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లోని ఉద్యోగులకు ప్రతిరోజూ ఆర్గానిక్ థాలీ ఉద్యోగులు కౌంటర్ ఏర్పాటు చేసి భోజనాలు వడ్డిస్తున్నారు. ప్రతిరోజూ 1500మందికి భోజనం వడ్డిస్తున్నారు. ఏడురోజులు ఏడు రకాల మెనూతో థాలీని వడ్డిస్తున్నారు. కావాల్సిన వాళ్లు 9866777794 నంబరుకు ఫోన్ చేసి ఆర్డరిస్తే వడ్డించడానికి ఈ కంపెనీ సిద్ధంగా ఉంది.

ref http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/organic-thali-hyderabad-1-1-502977.html 

Comments

Popular posts from this blog

పరామర్శ

మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు

   ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన యుధం ఓటు .   కావున ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండ వినియోగించు కోవాలి . గ్రామాలలో కంటే పట్టణాలలో నే తక్కువ గా పోలింగ్ నమోదు అవుతుంది    విచిత్రమైన   పరిస్థితి   ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు     అంటే చదువుకున్న వారే ఓటు హక్కు ని వినియోగించుకోవడం లేదు .  100 కి 200 కి రైస్ కుకర్ ల కి ఎంతో విలువైన ఓటు ని అమ్ముకోకండి .   ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు . ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం . మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు .  నచ్చకపోతే నోటా ఎన్నికల బరిలో నేరచరితులు , ధనస్వాములు , కులస్వాములు .. కండబలాఢ్యులే ఉంటే ? వీళ్లెవరూ నచ్చకపోయినా ఓటెయ్యక తప్పనిసరి పరిస్థితి . ఇది మొన్నటి వరకు ఉన్న ఎన్నికల వ్యవస్థ . కానీ ఈ దఫా ఎన్నికల్లో నేరస్వామ్యంపై నిరసనాస్ర్తాన్ని సంధించేందుకు సరికొత్త అస్త్రం వచ్చేసింది . అదే నోటా ( నన్ ఆఫ్ ద ఎబోవ్ ) అనే ఆప్షన్ ‌ ను ఎన్