మానేరులో స్వయంభూగా వెలసిన దైవం అనంత పద్మనాభ స్వామిని తలపిస్తున్న వైనం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిండుగా ప్రవహించే మానేరు నది.. మానేటి మధ్యలో కోరిన కోర్కెలు తీర్చే స్వయంభుగా వెలసిన స్వామి రంగనాయకస్వామి. అనంత పద్మనాభ స్వామిని తలపించే రీతిలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఓ వైపు ప్రకృతి రమణీయమైన అందాలు, ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రదేశంలో స్వామివార ు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. సుల్తానాబాద్: సుల్తానాబాద్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల మధ్యన మానేరు ఒడ్డున రంగనాయకుల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక పండుగలు, ప ర్వదినాలలో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జ రుగుతాయి. పురాణాలను బట్టి ఒకప్పుడు దట్టమైన అడవితో ఉండి, పులులు, సింహాలువంటి క్రూర జంతువులు సంచరించే ప్రదేశం. మరోవైపు మునులు, బుుషులు తపస్సును ఆచరించే పవిత్రమైన స్థలం. 2వేల ఏళ్ల క్రితం స్వామివారు ఈ ప్రదేశంలో తన ఉనికిని చాటుకున్న ట్లు చరిత్ర చెబుతోంది. ఓ రైతు ఈ ప్రాంతంలో భూమిలో నాగలితో దున్నుతుండగా ఆ ప్రదేశంలో రక్త ప్రవాహం మొదలైంది. ఆ ప్రాం తంలో భూమంతా ...
పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు