Skip to main content

విధిని వెక్కిరించిన కలం యోధుడు...


ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు…
విధిని వెక్కిరించిన కలం యోధుడు...
కాల ఖడ్గం వేటు వేసినా, కలల విహంగమై ఎగిరేవాడే అచ్చమైనరచయిత.అటువంటి అరుదైన సృజనశీలి ముద్దసాని రాంరెడ్డి. ఒక ప్రమాదఘటన ఆయనను నిశ్చలుడిని చేసినా, మేధో విన్యాసానికి అడ్డుకట్ట వేయలేక పోయింది. తల, చేతులు, ఛాతీ తప్ప నడుము కింది భాగమంతా స్పర్ష కోల్పోయినా, 37 ఏళ్ళ పాటు- బతికినన్నాళ్లూజీవించాడు’. తెలుగు, ఉర్దూ, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో దిట్ట అయిన రాంరెడ్డి రచనా వ్యాసంగం జీవితాంతం కొనసాగింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలంలోని ఊటూరు గ్రామంలో 1925 జూన్ ఆరవ తేదీన జన్మించిన రాంరెడ్డి 1945లో ఉర్దూ మీడియంలో మెట్రిక్ పా సయ్యారు. నాగ్పూర్లో ఇంటర్ చదివి, పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీఏ పూర్తి చేశా రు.ఆతరువాతఎం..(తెలుగు), ఎంసిజె, ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1958లో జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి (డిపిఆర్వొ) గా చేరి, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లలో పనిచేశారు. 1967 ఆగస్టు 16 విధినిర్వహణలో ప్రయాణిస్తున్నప్పుడు కారు ప్రమాదంలో గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతిని నడుము కింది భాగమంతా స్పర్ష లేకుండా పోయింది. కదలలేని స్థితి వల్ల ఆయన ఉద్యోగం పోయింది.
సురవరం సాహిత్య వైజయంతి వెలువరించిన కరపత్రంలో రాంరెడ్డి గార్ని ‘ఆంధ్రా స్టీఫెన్ హాకింగ్‌’ గా అభివర్ణించింది. అనువాద రచనలకు గాను తెలంగాణా పతాక రచయితగా మిగిలిపోయే ముద్దసాని రాంరెడ్డి అంపశయ్య మీద అక్షర సూర్యుడే.
పరిస్థితులు ప్రతికూలించినా రాంరెడ్డి కుంగిపోలేదు.రేడియో వ్యాసాలతో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభమైంది. సురవరం ప్రతాపరెడ్డిపై రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సుజ్జద్ జహీర్ ఉర్దూ రచనలండన్లో ఒక రాత్రిపేర తె లుగులో అనువదించారు. దీనిని విశాలాం ధ్ర పబ్లికేషన్స్ ప్రచురించింది. ‘నర్మద శం కర్ జీవిత చరివూతకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. బూర్గుల రామకృష్ణారావు జీవితం- సాహిత్యం పుస్తకాన్ని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ ప్రచురించింది. ప్రముఖ హిందీ రచయిత లాల్ శుక్లా రాసినరాగ్ దర్బారేనుదర్బారు రాగంపేర అనువదించారు. దీనిని నేషన ల్ బుక్ ట్రస్టు ప్రచురించింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. నరేంద్ర లూథర్ రాసినహవాయి-కొలంబస్రచననుగాలి మేడల కొలంబస్గా అనువదించారు.‘ఆధునిక రాజ్యాంగ తత్వమునకు అరవిందుని తో డ్పాటుపుస్తకానికి తెలుగు అకాడమీ అవా ర్డు లభించింది. దీనిని డిగ్రీ పాఠ్య గ్రంథం గా నిర్ణయించారు.
హిస్టరీ ఆఫ్ ఫ్రీడం ము వ్మెంట్ఆంగ్ల రచనకు 1996లో ఢిల్లీ ప్రభుత్వ పురస్కారం లభించింది. సబ్దుల్ సమద్ రాసినదో గజ్ జమీన్నుఆరడుగుల నేలపేర అనువదించారు. దీనిని కేంద్ర సాహిత్యఅకాడమీప్రచురించింది.‘సియాసత్పత్రిక వ్యవస్థాపకులు అబిద్ అలీఖాన్ ఉర్దూ భాషకు చేసిన సేవలపై రాం రెడ్డి పుస్తకం రాశారు. సూఫీ కవి,తత్వవేత్త ఫరీజ్బాబా చరివూతను హిందీ నుంచి అనువదించారు. ‘వదినె గారి గాజులునవలను మరాఠీలోకి అనువదించారు. ఉర్దూ రచయిత్రి ఇన్మక్త్ చుక్తాయి రాసినతేడ్ - ఖీర్నవలనువక్షికరేఖపేర అనువదించారు. రాంరెడ్డికి తెలుగు విశ్వవిద్యాలయం అనువాద రచనా పురస్కారం, సురవరం సాహితీ వైజయంతి పురస్కారంతోపాటు పలు అవార్డులు లభించాయి. కానీఆయనకు ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత మాత్రం లభించలేదు. వారాల ఆనంద్ నిర్మించిన తెలంగాణ సాహితీ మూర్తుల డాక్యుమెంటరీలో రాంరెడ్డి మొదటివారు

2007 జనవరి 07 ముద్దసాని రాం  రెడ్డి గారు మరణించారు 
రాంరెడ్డి మరణానంతరం కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం విశేషం. ఇది భూమి పుత్రుడికి ప్రజలు ఇచ్చిన గౌరవం. దీనికి ప్రపంచంలోని అవార్డూ సాటి రాదు.

ముద్దసానికి లభించిన అవార్డులు -
1. సురవరం ప్రతారెడ్డి జీవితం -రచనలు 1973 (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ బహుమతి)
2. బూర్గుల రామకృష్ణారావ్ జీవితం – సాహిత్యం 1982 (ఈపుస్తకాన్ని రాష్టప్రౌరసంబంధాల శాఖ ప్రచురించింది.)
3. లండన్‌లో ఒకరాత్రి 1975 ( విశాలాంధ్ర ప్రచురణ)
4. ఆధునిక రాజ్యాంగ తత్వానికి అరవిందుని తోడ్పాటు 1981 (తెలుగు ఆకాడమీ అవార్డు అందుకున్న ఈ పుస్తకాన్ని 1984లో డిగ్రీస్థాయి పాఠ్యగ్రంథంగా వుంచారు)
5. నర్మదా శంకర్ జీవిత చరిత్ర – సాహిత్యం 1984 (కేంద్ర సాహిత్యకాడమీ ప్రచురణ)
6. దర్బారు రాగం 1985 (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు)
7. హిస్టరీ ఆఫ్ ఫ్రీడం మూవ్‌మెంట్ – 1986 (పదివేల రూపాయల బహుమానం)
8. ఇందిరాగాంధీ ఆత్మకథ – నా సత్యపథం – 1988
9. గాలిమేడల కొలంబస్ (ఆంధ్రప్రదేశ్ పత్రికలో ధారావాహిక)
10. ఆరడుగుల నేల – 2000 (కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ)
11.  రాష్టప్రతి ‘రోల్ మోడల్’ అవార్డు అందుకోవల్సి వుండె. ఆ అవార్డుని స్వీకరించకుండానే ఆయన కన్నుమూసారు.
________________________________________________________________________________

Documentary on MUDDASANI RAM REDDY

PART-1


PART-2


PART-3




PART-4

Comments

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు