ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు… విధిని వెక్కిరించిన కలం యోధుడు... కాల ఖడ్గం వేటు వేసినా , కలల విహంగమై ఎగిరేవాడే అచ్చమైనరచయిత . అటువంటి అరుదైన సృజనశీలి ముద్దసాని రాంరెడ్డి . ఒక ప్రమాదఘటన ఆయనను నిశ్చలుడిని చేసినా , మేధో విన్యాసానికి అడ్డుకట్ట వేయలేక పోయింది . తల , చేతులు , ఛాతీ తప్ప నడుము కింది భాగమంతా స్పర్ష కోల్పోయినా , 37 ఏళ్ళ పాటు - బతికినన్నాళ్లూ ‘ జీవించాడు ’. తెలుగు , ఉర్దూ , మరాఠీ , హిందీ , సంస్కృతం , ఆంగ్ల భాషల్లో దిట్ట అయిన రాంరెడ్డి రచనా వ్యాసంగం జీవితాంతం కొనసాగింది . కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలంలోని ఊటూరు గ్రామంలో 1925 జూన్ ఆరవ తేదీన జన్మించిన రాంరెడ్డి 1945 లో ఉర్దూ మీడియంలో మెట్రిక్ పా సయ్యారు . నాగ్ పూర్ లో ఇంటర్ చదివి , పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్ లోని ని...
పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు