Skip to main content

కోరిన కోర్కెలు తీర్చే మానేటి రంగనాయకస్వామి

మానేరులో స్వయంభూగా వెలసిన దైవం
అనంత పద్మనాభ స్వామిని తలపిస్తున్న వైనం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు
నిండుగా ప్రవహించే మానేరు నది.. మానేటి మధ్యలో కోరిన కోర్కెలు తీర్చే స్వయంభుగా వెలసిన స్వామి రంగనాయకస్వామి. అనంత పద్మనాభ స్వామిని తలపించే రీతిలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఓ వైపు ప్రకృతి రమణీయమైన అందాలు, ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రదేశంలో స్వామివారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు.
సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల మధ్యన మానేరు ఒడ్డున రంగనాయకుల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక పండుగలు, ప ర్వదినాలలో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జ రుగుతాయి. పురాణాలను బట్టి ఒకప్పుడు దట్టమైన అడవితో ఉండి, పులులు, సింహాలువంటి క్రూర జంతువులు సంచరించే ప్రదేశం. మరోవైపు మునులు, బుుషులు తపస్సును ఆచరించే పవిత్రమైన స్థలం. 2వేల ఏళ్ల క్రితం స్వామివారు ఈ ప్రదేశంలో తన ఉనికిని చాటుకున్న ట్లు చరిత్ర చెబుతోంది. ఓ రైతు ఈ ప్రాంతంలో భూమిలో నాగలితో దున్నుతుండగా ఆ ప్రదేశంలో రక్త ప్రవాహం మొదలైంది. ఆ ప్రాం తంలో భూమంతా రక్తంతో తడిసిపోయింది. అ దేరోజు నీరుకుల్ల, కాట్నపల్లి, వేగురుపల్లి, ఊ టూరు, మానకొండూరు, గట్టెపల్లి, గర్రెపల్లి త దితర గ్రామాల్లోని దేశ్‌ముఖ్‌లు, గ్రామ పాలకులకు స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి తా ను ఫలాన చోటులో వెలసిన వైనాన్ని తెలియపరిచాడు. వెంటనే పా లకులు స్వామివారు ఉన్న ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించి రక్త ప్రవాహాన్ని గుర్తించి స్వామి వారు ఇక్కడే వెలసినట్లు నిర్ధారించుకొని అక్కడ మట్టిని తవ్వగా బండకు నెరిసి ఉన్న స్వామి ఆకారం
బయటపడింది. అనంతరం స్వామికి పూజలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి నుంచి శ్రీరంగనాయకుల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చా రు. గర్భగుడిని, కొన్నాళ్ల తర్వాత మండపం నిర్మించారు. సుల్తానాబాద్‌ నుంచి నీరుకుల్లకు రోడ్డు ఉన్నా ఆర్టీసీ సేవలు లేవు. కరీంనగర్‌ వై పు నుంచి గర్రెపల్లి మీదుగా, సుల్తానాబాద్‌ నుంచి రెండు వైపులా రోడ్డు మార్గాలున్నాయి. రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.
శ్రీరంగంలో కావేరి నదిలో
నీరుకుల్లలో మానేరులో...
రంగనాయకుల స్వామి వారి ఆలయాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా గుట్టలు, కొండల పైన, గ్రామాల నడి మధ్యలో ఉన్నాయి. కానీ నీరుకుల్లలోని రంగనాయకస్వామి మాత్రం మానేరు నది మధ్యలో స్వయంభుగా వెలిసి ఉండడం ఇ క్కడి విశిష్టత. ఇదే విధంగా కలియుగ వైకుంఠంగా నిలిచిన శ్రీరంగంలో రంగనాయకుల స్వామి మధ్య కావేరి నదిలో వెలసి ఉన్నారు. అంతటి విశిష్టతతో ఇక్కడి ఆలయం ప్రత్యేకత కలిగి ఉంది.
చిన్న జీయర్‌ రాకతో అభివృద్ధి
ఏడేళ్ల క్రితం చిన్నజియర్‌ స్వామి తన ఆధ్యాత్మికత పర్యటనలో భాగంగా రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. దక్షిణ భారతంలో శ్రీరంగం తర్వాత అంతటి విశిష్టత కలిగి ఉన్న ఇక్కడి ఆలయం గురించి వివరించారు. కానీ ఈ ఆలయం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. గ్రామస్థులు, పుర ప్రముఖులతో చర్చించి ఆలయ విస్తరణ, జీర్ణోద్ధరణ అభివృద్ధికి ప్రణాళికలను ఇచ్చారు. అందుకు అనుగుణంగా దాతల సహకారంతో పునఃనిర్మించారు. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ ఆవరణలోనే సమ్మక్క సారలమ్మల జాతర కూడా నిర్వహిస్తున్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామిని పోలి ఉండడంతో ఇక్కడికి భక్తుల రాకపోకలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఈ ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, మంచినీటి ట్యాంకు, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు
రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్‌ మాసంలో నిర్వహిస్తారు. 15 రోజులకు పైగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరుపుతారు. జాతరలు, రథయాత్రలు, కల్యాణోత్సవాలు, హోమాలు, యజ్ఞాలు ఇందులో ప్రధానమైనవి. ఇదే ఆవరణలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో లక్షలాది భక్తులు పాల్గొనడం విశేషం.



www.utoorvillage.blogspot.in

Comments

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు